ఉపాసన చేతిలోకి సైరా

215
Upasana
- Advertisement -

రామ్‌చ‌ర‌ణ్ సినిమాల విష‌యంలో ఉపాస‌న కాస్త కేరింగ్ తీసుకొంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. రంగ‌స్థ‌లం సెట్లో త‌ర‌చూ ఉపాస‌న ఎంట్రీ ఇవ్వ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌నం. అయితే ఇప్పుడు `సైరా`లోనూ ఉపాస‌న హ‌స్తం ఉన్న‌ట్టు టాక్‌. ఈ సినిమాకి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. అయితే చెర్రీ రంగస్థలం 1985 సినిమాలో బిజీగా ఉండడం వల్ల అప్పటివరకు ఉపాసన సైరా వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన అన్ని ఏర్పాట్లని పూర్తి చేసుకున్నారు. మరి కొన్ని రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వనుంది.

Chiranjeevi-Upasana

అయితే రామ్ చరణ్ రంగస్థలం 1985 సినిమా షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. దీంతో రెండు బాధ్యతలను ఒకేసారి నిర్వహించడం చాలా కష్టమైపోతుందని ఉపాసన వర్కింగ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు తీసుకొని తన భర్త కి కాస్త సహాయంగా ఉండనున్నారట. ఆమె ఇంతకుముందు కూడా ఖైదీ నెంబర్ 150 – ధృవ సినిమాలకు కూడా పేరు వేసుకోలేదు కాని.. వర్కింగ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారని రూమర్లు రానే వచ్చాయి. కాకపోతే ప్రస్తుతం ఆమె సొంత బిజినెస్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి.. సైరా సినిమాకోసం నిజంగా పనిచేస్తారా లేదా చూడాల్సి ఉంది.

Chiranjeevi-Upasana

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. దీపావ‌ళి త‌ర‌వాత షూటింగ్ మొద‌లెడ‌తారు. న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఐశ్వ‌ర్య‌రాయ్‌, అనుష్క‌ల‌కూ క‌థానాయిక‌లుగా స్థానం ద‌క్కింద‌ని టాక్‌. రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌య్యేలోగా ఈ విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

- Advertisement -