భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) ద్వైపాక్షిక సంబంధాలలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ ఒప్పందాన్ని ఇంత తక్కువ సమయంలో ముగించినందుకు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్‌తో ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఇద్దరు నేతలు ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా పీఎం మోదీ మాట్లాడుతూ … ఒక భారత ప్రధాని 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌లో పర్యటించడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.మీ ఆర్థిక రాజధానిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య సంబంధాలకు సరికొత్త శక్తిని నింపే అవకాశాన్ని మీరు కల్పించారు అని కొనియాడారు. న్యూజిలాండ్ ప్రజలు భారతదేశంపై చూపిస్తున్న ఆప్యాయతను చూడటం నా హృదయాన్ని కదిలించే ఒక గొప్ప అనుభూతి అందుకు కూడా నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇది మా సంబంధంలో ఒక చారిత్రాత్మక మైలురాయి…. ఇది మా బంధాన్ని పునరుజ్జీవింపజేస్తుంది మరియు స్నేహానికి మా నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది అని చెప్పారు.
మీరు భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఎఫ్‌టీఏ (FTA) ప్రక్రియ ప్రారంభమైంది…. ఇంత తక్కువ సమయంలో ఎఫ్‌టీఏను సాకారం చేయడానికి న్యూజిలాండ్ అంతా ఏకమైన తీరు బహుశా ఇంత వేగంగా విజయం సాధించడం ప్రపంచంలోనే మొదటిదేమో ఇది నిజంగా అద్భుతం. ఈ విజయానికి మీ నాయకత్వానికి, మీ ప్రభుత్వానికి మరియు మీ బృందానికి నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.
Also Read:వర్షాకాలం..గర్భిణీ స్త్రీలకు కొత్త సమస్యలు!

