దేశంలో మరో కొత్త వైరస్ కలకలం!

86
virus
- Advertisement -

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) వెలుగుచూసింది. జంతు వనరుల అభివృద్ధి శాఖ (ఏఆర్‌డీడీ) నిర్వహిస్తున్న ఫారమ్‌లో ఈ తరహా కేసులు గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

ఈ నెల 7వ తేదీన శాంపిల్స్‌ సేకరించి టెస్ట్‌ కోసం ఈశాన్య ప్రాంతీయ వ్యాధి నిర్ధారణ లాబోరేటరీకి పంపగా.. 13వ తేదీన వచ్చిన పీసీఆర్‌ ఫలితాల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ నిర్ధారణ అయిన తర్వాత పందులను చంపేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది.

మొదటి పందులను సామూహికంగా చంపేయడం.. ఆ తర్వాత వైరస్‌ సోకిన పందులను పాతిపెట్టడానికి 8 అడుగుల మేర లోతైన గుంతలను తోవి అందులో పాతిపెట్టనున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 63 పందులు.. గుర్తు తెలియని కారణాలతో చనిపోయాయని.. ఆ పందుల షెడ్డులో 265 పందులు మరియు 185 పంది పిల్లలు ఉన్నాయని వెల్లడించారు.

- Advertisement -