భారత విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటాం:అమెరికా

171
covid
- Advertisement -

భారత్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తికి ముడి సరుకును సజావుగా సరఫరా చేసేలా చూడాలని…అన్నిరకాలుగా వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో అమెరికా స్పందించింది. వ్యాక్సిన్‌ ముడిపదార్థాలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టంచేసింది. కేవలం అమెరికా ఫార్మా కంపెనీలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిబంధనలు ఉన్నాయని తెలిపింది.

భారత్‌ ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నామని, ఈ మేరకు విషయాన్ని పరిగణలోకి తీసుకుంటామని బిడెన్‌ పాలకవర్గం హామీ ఇచ్చింది. అమెరికా ఆంక్షల కారణంగా భారత్‌లో వ్యాక్సిన్‌ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై వ్యాక్సిన్‌ సంస్థలతో పాటు భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలపై స్పందించింది.

అమెరికాలో దేశీయ సంస్థలకు ప్రయోజనం కల్పించేందుకు ఢిపెన్స్‌ ప్రొడక్షన్‌ యాక్ట్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అమలులోకి తేవడంతో వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అమెరికా నిర్ణయంతో ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీదారుగా ఉన్న భారత కంపెనీలపై పడింది. ముఖ్యంగా సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాపై తీవ్ర ప్రభావం చూపింది. వ్యాక్సిన్‌ తయారీకి వినియోగించే ముడి సరుకులపై నిషేధం ఎత్తివేయాలని అమెరికా అధ్యక్షుడికి ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -