బ్రిస్బేన్ టెస్ట్‌: ముగిసిన నాలుగో రోజు ఆట

155
4th Test
- Advertisement -

బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ ముందు 328 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఇక భారీ లక్ష్యంతో భారత్‌ బారిలోకి దిగింది. అయితే ఇన్సింగ్స్‌ మొదలవ్వగానే ఆటకు వ‌ర్షం వల్ల అంత‌రాయం క‌లిగింది. ఈ కార‌ణంగా నాలుగో రోజు ఆట ముందే ముగిసింది. 328 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 1.5 ఓవ‌ర్ల‌లో 4 ప‌రుగులు చేసింది.

ఈ స‌మ‌యంలో వ‌ర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ త‌ర్వాత చాలా సేప‌టి వ‌ర‌కూ వ‌ర్షం కురుస్తూనే ఉండ‌టంతో నాలుగో రోజు ఆట ముగిసిన‌ట్లు అంపైర్లు ప్ర‌క‌టించారు. మ‌రో రోజు ఆట మాత్ర‌మే మిగిలి ఉండ‌గా.. టీమిండియా విజ‌యానికి 324 ప‌రుగుల దూరంలో ఉంది. రోహిత్ శ‌ర్మ (4 నాటౌట్‌), శుభ్‌మ‌న్ గిల్‌(0 నాటౌట్‌) క్రీజులో ఉన్నారు. అంతకుముందు రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టును 294 పరుగులకు భారత బౌలర్లు ఆలౌట్ చేశారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లలో మార్కస్ 38, వార్నర్ 48, లబుషేన్ 25, స్టీవ్ స్మిత్ 55, మ్యాథ్యూ వేడ్ 0, కెమెరాన్ గ్రీన్ 37, టిమ్ పైనీ 27, మిచెల్ స్టార్క్ 1, నాథన్ లియాన్ 13, హాజల్ వుడ్ 9 పరుగులు చేసి అవుట్ కాగా, పాట్ కమిన్స్ 28 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని, ఆస్ట్రేలియా 327 పరుగులు చేసి భారత్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -