టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఐదో టెస్టులో టాస్ ఓడాడు శుభ్‌మన్ గిల్. అంతేగాదు భారత్ వరుసగా 15 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఓడిపోగా ఇందుకు సంబంధించి మైకేల్ అథర్టన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సిరీస్‌లో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడు కెప్టెన్లతో పాటు టాస్ వేసేందుకు వచ్చాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రిని ఉద్దేశించి అథర్టన్…టీమ్ఇండియా టాస్ ఓడిపోవడంలో నవ్వు బాధ్యుడివే.. నిన్ను తప్పిస్తారు చూసుకో అని అన్నాడు.
దీనిపై స్పందించిన రవిశాస్త్రి… కాయిన్ నేలపై పడిన తరువాత కనీసం గిల్ అటు వైపు చూడడం లేదన్నాడు. భారత జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (52), వాషింగ్టన్ సుందర్ (19)లు క్రీజులో ఉన్నారు.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ

