మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలి అని అడిగితే ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.
మా ప్రజల బతుకుదెరువు, మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు.. మాట్లాడితే కాదు అన్నారు. రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడాడు.. కానీ తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాము అని చెప్పారు.
గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపురంలో కాట్లాడటం, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా? చెప్పాలని లోకేష్‌ని ప్రశ్నించారు హరీష్. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బనకచర్ల విషయంలో కేంద్రం దిగి రాదా? చెప్పాలన్నారు.
కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటును స్తంభింపచేస్తే బనకచర్ల ప్రాజెక్టు ఆగిపోదా?… 16 మంది ఎంపీల మౌనం వల్లనే చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు కడుతున్నాడని తెలంగాణ ప్రజలకు అర్థం అవుతుంది అన్నారు.
Also Read:టాస్ ఓడారు..రవిశాస్త్రికి ఎసరు!

