ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ విధించిన 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులు చేసి ఓడింది.దీంతో ఇంగ్లాండ్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో జట్టును గెలిపించేందుకు చేసిన ఒంటరి పోరాటం విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్ (55 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117) రాణించాడు. పంత్ (1), కోహ్లీ (11), రోహిత్ (11) విఫలమయ్యారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (77), లివింగ్‌స్టోన్ (42 నాటౌట్) రాణించారు. రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ టోప్లేకు మూడు, విల్లే, జోర్డాన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా టోప్లే, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా భువనేశ్వర్ నిలిచారు.