తెలంగాణ సాయుధ పోరాటంపై వెబ్ సిరీస్

325
ts
- Advertisement -

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం…. భూమి, భుక్తి, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం రైతుకూలీ జనం తిరగబడిన అపూర్వ ఘట్టం. చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించిన అద్భుత సందర్భం. ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తమ ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలోనే వెబ్ సిరీస్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు కృష్ణవంశీ వెల్లడించారు. 5 సీజన్స్ గా రూపొందించే అవకాశముంది. ఒకో సీజన్‌కు 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే మొత్తం 50 ఎపిసోడ్స్. ప్రతీ చిన్న విషయాన్ని కూలంకషంగా ఆవిష్కరించే వీలుంది.

తెలంగాణ చరిత్ర గురించి, ఇక్కడి వీరుల గురించి తెలుసుకోడానికి కృష్ణవంశీ ఇప్పుడు తీవ్ర కసరత్తులు చేస్తున్నారట. దీనికోసం చరిత్ర కారుల్ని కలుసుకొని, వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రలో ‘రంగమార్తాండ’ అనే సినిమా చేస్తుండగా ఇది ఆగస్టులో విడుదలకానుంది.

- Advertisement -