భారత్‌లో లాక్‌డౌన్‌ విధించాల్సిందే..

188
lock
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్ధాయిలో 4 లక్షల కేసులు నమోదుకాగా మృతుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఈ నేపథ్యం అంతర్జాతీయంగా కోవిడ్ మ‌హ‌మ్మారిపై అధ్య‌య‌నం చేస్తున్న డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ….భారత్‌లో లాక్‌డౌన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

భార‌త్‌లో మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్‌, ఆస్ప‌త్రుల‌తో పాటు లాక్‌డౌన్ కూడా త‌ప్ప‌ద‌ని వెల్లడించారు. క‌నీసం.. రెండు మూడు వారాలు లాక్‌డౌన్ విధిస్తే ప‌రిస్థితి అదుపులోకి వ‌స్తుంద‌న్నారు.కోవిడ్ క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్‌లో స్పీడ్ పెంచాల‌ని సూచించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు టీకాలు వేయ‌డం త‌ప్ప‌నిస‌ర‌న్న ఆయ‌న‌….. ఆక్సిజ‌న్ కొర‌త తీరాలంటే వెంట‌నే యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను నిర్మించి, ఉత్ప‌త్తిని పెంచాల‌న్నారు.

- Advertisement -