మునుగోడు ప్రజా దీవెన సభలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ రాచరిక వ్యవస్థ లేదన్నారు. నిన్ను నీ అహంకారమే నిన్ను అంతం చేస్తుందన్నారు. ప్రతి రాష్ట్రాన్నికి ఏక్ నాథ్ షిండేలను తీసుకువచ్చి ప్రజా ప్రభుత్వాలను పడగొడతాము అంటారా.. మీకు ఎందుకు అంతా అహంకారమని మండిపడ్డారు. దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందన్నారు. ఈడీకి బోడికి భయపడం నేను ఎందుకు భయపడతా… దొంగలు భయపడి మీ పార్టీలో చేరుతారన్నారు.
ఈడీ గాళ్లకు బోడీ గాళ్లకు భయపడమన్నారు. వాళ్లే వచ్చి నాకు చాయ్‌కి పైసలు ఇచ్చి పోతర్రు. ఎవరు యుద్దం చేస్తారో వాళ్లకే కత్తి ఇవ్వాలి అంతేగాని వేరే వాళ్లకు కత్తి ఇస్తే యుద్దం ఏలా చేస్తారన్నారు. మోదీ మీరు గోకినా గోకకపోయినా..నేను మోదీని గోకుతాన్నన్నారు. దిల్లీలో కరెంట్ ఉండదు… కానీ హైదరాబాద్‌లో మాత్రం 24 గంటలు కరెంట్ ఉంటుంది. మీకు పాలనా చేత కాదు కానీ చేసే వాళ్ల కాళల్లో కట్టేలు పెడుతున్నావు ఇదేనా మీరు ఉద్దరిస్తా అన్నది ఇక ప్రజలు మిమ్మల్నీ చాలాంటున్నారు. పాల మీద పన్ను, సశ్మానం మీద పన్ను, పెరుగు మీద పన్ను ఇలా అన్నింటినీ మీద జీఎస్టీ వేస్తూ మీ సుటుకేసు దోస్తులకు పంచిపెడితూ….ఎన్‌పీఏ కింద ౠణాలు మాఫీ చేశారు.
2014లో గ్యాస్ ధర సూమారుగా రూ. 400 ఉంటే ఇప్పుడు దానికి మూడు రేట్లు పెంచి సామాన్యుల నడ్డి విరిచావు. మునుగోడు ప్రజలు ఓటు వేసే ముందు ఒక్కసారి గ్యాస్ ధర బండలను చూసి ఓటేయండి. మాటలు విని మోసపోతే మనమే గోస పడతాం సుమా చాలా అలోచించి ఓటు వెయ్యాలన్నారు. అందరం కలిసి బీజేపీకి మీటర్ పెడదమన్నారు. దయచేసి ప్రలోభాలకు లోంగి ఓటు వెయ్యోద్దు. మన వెలితో మన కన్నును పోడుచుకుంటే ఏలా ఉంటుందో అలాగే ఉంటుందన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. మీటర్లు పెట్టనివ్వనని అని చెప్పారు.