దేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అస్సాంలో కేసు నమోదు కావడంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం 15 హచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో అత్యధికంగా నాలుగు ,మహారాష్ట్రంలో మూడు, కర్ణాటక రాష్ట్రంలో రెండు, తమిళనాడులో రెండు, కోల్‌కతాలో మూడు, అస్సాంలో ఒక కేసు నమోదైంది.
నిరంతరం దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని వైద్య అధికారులు సూచించారు.
హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వైరస్ కొత్తది కాదని.. ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. బయట ప్రదేశాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగివచ్చిన తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.
Also Read:ఏపీకి మరో 50 మంది ఎమ్మెల్యే లు!