నేపాల్‌కు అండగా భారత్

4
- Advertisement -

భయంకర జలప్రళయంతో చిగురుటాకులా వణుకుతున్న పొరుగు దేశం నేపాల్‌ను ఆదుకునేందుకు భారతదేశం మరోసారి తన మానవతా స్ఫూర్తిని చాటుకుంది. నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు, GLOF విపత్తు కారణంగా వేలాది మంది ప్రజలు అల్లాడుతున్న వేళ, వారికి తక్షణ ఉపశమనం అందించేందుకు భారత వైమానిక దళానికి (IAF) చెందిన C-17 గ్లోబ్‌మాస్టర్ విమానం రెండో రిలీఫ్ ఫ్లైట్‌గా గురువారం నేపాల్‌కు బయలుదేరింది.

ఈ ప్రత్యేక విమానంలో మొత్తం 37.5 టన్నుల అత్యవసర సహాయ సామగ్రిని భారత్ పంపించింది. బాధితులకు తక్షణ వైద్యం అందించేందుకు, వరద తదుపరి వ్యాధులు వ్యాపించకుండా నిరోధించేందుకు అవసరమైన అత్యవసర ప్రాణరక్షణ మందులు ఉన్నాయి. సర్వం కోల్పోయిన బాధితుల కోసం సిద్ధం చేసిన తక్షణ ఆహార పదార్థాలు మరియు రక్షిత తాగునీరు.

బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన టెంట్లు, దుప్పట్లు, రెస్క్యూ ఉపకరణాలు మరియు రాత్రి వేళల్లో ఉపయోగపడే లైటింగ్ పరికరాలు.

Also Redad:క్రీడలకు మరింత ప్రాధాన్యం:మోదీ

నేపాల్ తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రతీసారీ భారత్ ‘ఫస్ట్ రెస్పాండర్’గా నిలిచి సహాయ సహకారాలు అందిస్తూ వస్తోంది. నేపాల్‌లో జలప్రళయం సంభవించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ, భారత్ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పటికే మొదటి విడతగా టన్నుల కొద్దీ సాయాన్ని అందించిన భారత్, ప్రస్తుతం రెండో రిలీఫ్ ఫ్లైట్ ద్వారా 37.5 టన్నుల సామగ్రిని పంపి తన పొరుగు సేవా ధర్మాన్ని పునరుద్ఘాటించింది.

- Advertisement -