- Advertisement -
రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచదేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలిచి ఒత్తిడి తెస్తున్న రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది.
డ్రోన్లు, మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడుతోండగా ఆ దేశంలో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులకు కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలో భారతీయులు ఎవరూ యుక్రెయిన్ రాకూడదని ఆదేశించింది. అలాగే యుక్రెయిన్‌లో ఉంటున్న విద్యార్థులతోసహా భారతీయులంతా వీలున్నంత త్వరగా ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. యుక్రెయిన్ రావాలనుకుంటున్న భారతీయులు తమ ప్రయణాన్ని రద్దు చేసుకోవాలని సూచించింది.
- Advertisement -