దేశవ్యాప్తంగా ఘనంగా ముస్లిం సోదరులు ఈదుల్-ఫితర్ (రంజాన్) పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆనందోత్సాహలతో పండుగ చేసుకుంటున్నారు. రంజాన్ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్,ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ నరసింహన్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్,చంద్రబాబు మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
దేశ ప్రజలకు ముఖ్యంగా దేశ విదేశాల్లోని ముస్లిం సోదర సోదరీమణులకు ఈద్ శుభాకాంక్షలు. ఈ వేడుక మీ కుటుంబాల్లో ఆనందోత్సాహాలు నింపాలి. సమాజంలో సోదరభావం, ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం పెరగాలని రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు.
ఈద్ ముబారక్.. ఈ రోజు మన సమాజంలో ఐక్యత మరింత పెరగాలని, సామరస్యం వెల్లివిరియాలని ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ఐక్యత,సోదర భావానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ తెలిపారు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ అందరి జీవితాల్లో సంతోషం నింపాలని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.