రొనాల్డో..రియల్ హీరో

277
ronaldo
- Advertisement -

రష్యా వేదికగా జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో అద్భుతం జరిగింది. హ్యాట్రిక్‌ గోల్స్‌తో స్పెయిన్‌ను మట్టికరిపించాడు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో. తన జీనియస్‌ గేమ్‌తో ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చాడు. పోర్చుగల్‌ ఓటమి తప్పదనుకున్న దశలో ఫ్రీ కిక్‌తో అద్భుత గోల్ సాధించి గట్టెక్కించాడు.

మ్యాచ్ ప్రారంభమైన 4వ నిమిషంలోనే రొనాల్డో పెనాల్టీని గోల్‌గా మలిచి పోర్చుగల్ ఖాతా తెరిచాడు. ఆ తర్వాత 44వ నిమిషంలో స్పెయిన్ డిఫెండర్లను ఛేదిస్తూ రొనాల్డో ఫీల్డ్ గోల్ చేసినా.. ఆ తర్వాత పుంజుకున్న స్పెయిన్ ఆట 55వ నిమిషానికి ఆధిక్యాన్ని 2-2తో సమం చేసింది. ఈ దశలో పోర్చుగల్ ఆటగాళ్లపై ఒత్తిడి పెరగగా.. నాచో మరో గోల్‌ కొట్టి స్పెయిన్ ఆధిక్యాన్ని 3-2కి పెంచాడు.

మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో.. రోనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో థ్రిల్ పుట్టించాడు. ఫ్రీ కిక్‌తో రోనాల్డో గోల్ చేసి పోర్చుగల్‌‌ జట్టు ఊపిరి పీల్చుకునేలా చేశాడు.

https://youtu.be/baWnvYuVsj0

- Advertisement -