దేశంలో తొలిమంకీపాక్స్ మరణం..

55
- Advertisement -

దేశంలో తొలి మంకీపాక్స్ మరణం సంభవించింది. కేరళ త్రిసూర్ జిల్లాలోని వ్యక్తికి పాజిటివ్ రాగా తీవ్రమైన అలసట, మెదడువాపు కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

ట్రీట్మెంట్ ఏ దశలో తీసుకున్నాడనే దానిపై విచారణ జరుపుతామని.. వైరస్ తీవ్రతతోనే మృతి చెందాడా.. అప్పటికీ సమస్యతో బాధపడుతూనే ఉన్నాడా అనే దానిపై వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మూడు కేరళలో ఫైల్ అవగా, ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒకటి. ఇక ఇప్పటివరకు 78దేశాల్లో ఇప్పటివరకూ 18వేల కేసులు నమోదయ్యాయి.

- Advertisement -