భారత్ – ఇంగ్లాండ్ తొలిటెస్ట్ డ్రా..

89
ind

భారత ఆశలపై నీళ్లు చల్లాడు వరణుడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ చివరి రోజు ఒక్కబాల్ కూడా పడకుండానే వర్షార్పణం కావడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసినట్లు ప్రకటించారు అంపైర్లు. చివరి రోజు విజయానికి 157 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండగా విజయం లాంఛనమే అనుకున్న తరుణంలో వరణుడి రూపంలో అడ్డంకి తగిలింది.

ఇంగ్లాండ్ మొదటి ఇనింగ్స్ లో 183 పరుగులు చేయగా భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య జట్టు పుంజుకొని 303 పరుగులు చేసింది. అయితే రెండు ఇన్నింగ్స్ లో కలిపి మొత్తం 20 వికెట్లు భారత పెసర్లే తీయడం విశేషం. ఇక 209 పరుగుల లక్షయంతో నాలుగు రోజు చివరి సెషన్ లో తమ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీం ఇండియా 52 పరుగులు చేసి కేఎల్ రాహుల్(26) వికెట్ కోల్పోయింది.

క్రీజులో రోహిత్(12) పుజారా(12) నిలవగా మొత్తం వర్షార్పణం కావడంతో మొదటి టెస్ట్ డ్రా గా ముగిసింది.