హన్సిక @ మై నేమ్‌ ఈజ్‌ శృతి

132
hbd hansika

తెనాలి రామకృష్ణ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని మై నేమ్ ఈజ్ శృతి అంటూ రాబోతుంది. ఇవాళ హన్సిక బర్త్ డే సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో హ‌న్సిక సీరియ‌స్ లుక్‌లో ఏదో ఆలోచిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. మురళీశర్మ, జయప్రకాష్‌, ఆడుకాలం నరెన్‌, రాజా రవీంద్ర తదితరులు ఈ సినిమాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఎలాంటి ఎడిటింగ్‌ లేకుండా 105 నిమిషాల పాటు సింగిల్‌షాట్‌లో తెరకెక్కే సినిమాలో హన్సిక సోలో పర్ఫామెన్స్ చేసిన‌ట్టు చెబుతున్నారు.

వైష్ణవి ఆర్ట్స్‌ పతాకంపై రమ్య బురుగు, నాగేందర్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. శ్రీనివాస్‌ ఓంకార్‌ దర్శకుడు. బ్యాక్‌ అండ్‌ ఫోర్త్‌ స్క్రీన్‌ప్లేతో హన్సిక ఇప్పటి వరకు తన కెరియర్‌లో పోషించనటువంటి సరికొత్త పాత్రలో సస్సెన్స్‌ థ్ల్రిలర్ ఉంటుంద‌ట‌.