కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న ప్రజలకు డెల్టా ప్లస్ వేరియంట్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికి దేశంలో 50కి చేరువలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ కేసులు ఉన్నాయని తెలిపింది.
ఈ రాష్ట్రాలకే డెల్టా వేరియంట్ పరిమితం కాలేదని, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో 21, మధ్యప్రదేశ్‌లో ఆరు,కేరళ, తమిళనాడుల్లో మూడు, కర్ణాటకలో 2, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లలో ఒక్కో కేసు ఉన్నట్లు వెల్లడించాయి.
మహారాష్ట్రలోని రత్నగిరి, జల్‌గావ్.. కేరళలోని పాలక్కడ్, పతనమితిట్ట.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, శివ్‌పురిలలో ఉన్నాయి. ఇప్పటికే 9 దేశాలకు ఇది పాకినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో డెల్టా వేరియంట్ 80 దేశాలకు పాకిన విషయం తెలిసిందే.