దేశంలో 24 గంటల్లో 34,113 కరోనా కేసులు..

102
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 34,113 కరోనా కేసులు నమోదుకాగా 346 మంది మృతిచెందారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,26,65,534కు చేరగా 5,09,011 మంది కరోనాతో మృతిచెందారు.

ప్రస్తుతం దేశంలో 4,78,882 యాక్టివ్ కేసులుండగా 4,16,77,641 మంది కరోనా నుండి కోలుకున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతానికి పడిపోగా ఇప్పటివరకు 1,72,95,87,490 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -