భారత్‌కు సాయం చేయడానికి అమెరికా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని వెల్లడించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్. ఒహియోలోని సిన్సినాటిలో విలేఖరులతో మాట్లాడిన కమలా…భారత్‌లో పరిస్థితులు విషాదకరంగా ఉన్నాయని, కొవిడ్ సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన సహాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.
కరోనాతో చాలా మంది చనిపోతున్నారు…. పీపీఈ కిట్లకు తదితరాలకు అమెరికా ఇప్పటికే సాయం చేసిందని అని పేర్కొన్నారు. భారత్‌కు అమెరికా నుంచి సాయం అందడంపై భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యులు.. అధ్యక్షుడు జో బైడెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది అమెరికా. ఈ నెల 4వ తేదీ నుంచి ఆంక్షలు అమలులోకి వస్తాయని వైట్ హౌట్ శుక్రవారం తెలిపింది. అమెరికాలోకి ప్రవేశించడానికి ముందు 14 రోజుల వ్యవధిలో భారత్‌లో ప్రయాణించిన అమెరికాయేతర పౌరుల ప్రవేశాన్ని నిరోధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు.