కేటీఆర్ సార్…నా మాట నిలబెట్టుకున్నా: దేవి శ్రీ

123
devi

కేటీఆర్ సార్ మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని తెలిపారు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్. కొద్దిరోజుల క్రితం యువగాయని శ్రావణి టాలెంట్‌కు ఫిదా అయిన కేటీఆర్…ఆమెకు ఓ అవకాశం ఇవ్వాలని సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ని కోరగా ఆయన తప్పకుండా అని హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం తమిళంలో నిర్వహిస్తున్న స్టార్ టు రాక్ స్టార్ కార్యక్రమంలో శ్రావణికి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు దేవి శ్రీ. ఈ ఎపిసోడ్ జీ తమిళ్ ఛానల్లో జులై 18 ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రసారం అవుతుంది అని వివరించారు. దేవి ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ మీ స్పంద‌న అమోఘం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మెదక్ జిల్లా నారైంగి గ్రామానికి చెందిన శ్రావణి రేలా రే రేలా రే అనే తెలంగాణ పాటను పాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఆ వీడియో గమనించిన కేటీఆర్, దేవి శ్రీ ప్రసాద్.. తమన్ లకు ట్యాగ్ చేశారు. కేటీఆర్ చొరవతో శ్రావణికి మంచి అవకాశం దక్కింది.