దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు…

51
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2927 పాజిటివ్ కేసులు నమోదుకాగా 32 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,65,496కు చేరగా 4,25,25,563 మంది బాధితులు కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 16,279 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,23,654 మంది కరోనాతో మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల్లో 0.04 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉండగా రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతానికి చేరుకుంది.

- Advertisement -