దేశంలో 24 గంటల్లో 16,488 కరోనా కేసులు

222
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 16,488 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 113 మంది మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,10,79,979కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 1,59,590 యాక్టివ్ కేసులుండగా 1,07,63,451 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,56,938కు చేరింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,42,42,547 మందికి వ్యాక్సిన్లు వేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.

- Advertisement -