- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 24,882 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 140 మంది మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,33,728కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 2,02,022 యాక్టివ్ కేసులుండగా 1,09,73,260 మంది కరోనా నుండి కోలుకున్నారు. మొత్తం మృతుల సంఖ్య 1,58,446కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.78శాతం ఉండగా రికవరీ రేటు 9.82శాతం, మరణాల రేటు 1.40శాతం ఉంది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకు 2,82,18,457 డోసులు వేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
- Advertisement -