దేశంలో 24 గంటల్లో 27,071 కరోనా కేసులు..

248
india corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య 99 లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 27,071 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 336 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,84,100కు చేరింది.

ప్రస్తుతం దేశంలో 3,52,586 యాక్టివక కేసులుండగా 93,88,159 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,43,355 మంది మృతిచెందారు.

డిసెంబర్‌ 13 వరకు 15,45,66,990 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని గత 24 గంటల్లో 8,55,157 టెస్టులు చేసినట్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది.

- Advertisement -