- Advertisement -
భారత దేశంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. లాక్ సడలింపులతో పాజిటివ్ కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంది. ఇప్పటివరకు దేశంలో 81,970 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా గడిచిన 24 గంటల్లో 100 మంది చనిపోయారు.
ఇక ఇప్పటివరకు దేశంలో 2,649 మంది చనిపోగా గత 24 గంటల్లో 3,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ నుంచి 27,920 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
మహారాష్ట్రలో అత్యధికంగా 27,524 కేసులు నమోదు కాగా, 1,019 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత తమిళనాడులో 9,674( , గుజరాత్లో 9,592, ఢిల్లీలో 8,470 , రాజస్థాన్లో 4,589 కేసులు నమోదయ్యాయి.
- Advertisement -