భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 125కు చేరింది. కరోనాతో ఇప్పటివరకు ముగ్గురు మృతిచెందగా ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశంలోని అన్నిరాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించింది.
ఇక అన్ని ఎయిర్‌పోర్టుల్లో థర్మల్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయగా…. రైళ్లలోనూ ఈ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను పరీక్షిస్తున్నారు. సినిమా హాల్స్,మాల్స్,పబ్బులు మూతపడగా ఈ నెల 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
ఇప్పటివరకు అత్యధికంగా మహారాష్ట్రలో 39 కేసులు, కేరళలో 22 కేసులు నమోదైతే కర్ణాటకలో 8 కేసులు రిజిస్టర్ అయ్యాయి. వీరిలో ఒకరు మరణించారు. ఢిల్లీలో ఏడు కేసులు నమోదు కాగా, ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. ఏపీ,ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో 4 కేసులు నమోదు కాగా, ఒకరు గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.