వర్మ బాడిగార్డులను చూశారా!

331
rgv dogs
- Advertisement -

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకెక్కారు. కొంత మంది నుంచి తనకు రక్షణ కోసం కొత్తగా రెండు కుక్కలను పెంచుకుంటున్నట్లు తెలిపారు. కొంత మంది అభిమానులు నాపై దాడి చేయడానికి వచ్చినపుడు రక్షణ కోసం ఈకుక్కలను పెంచుకుంటున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఎవరి అభిమానుల నుంచి తనకు ముప్పు పొంచి ఉందో వారి పేర్లను కూడా ట్వీట్‌ చేశారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్,, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ల ఫ్యాన్స్ లను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారు వర్మ. తాజాగా వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ పై మండిపడుతున్నారు. ఇదిలాఉండగా రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం దిశ హత్యచార ఘటనపై సినిమా చేస్తున్నారు.

- Advertisement -