దేశంలో 24 గంటల్లో 12,689 కరోనా కేసులు

165
corona
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంట‌ల్లో దేశంలో 12,689 పాజిటివ్ కేసులు నమోదుకాగా 137 మంది మృతి చెందారు. దీంతో దేశంలో కరోనా కేసుల కోటి ఏడు ల‌క్ష‌ల‌కు చేరుకుంది.

ప్రస్తుతం దేశంలో ల‌క్షా 76 వేల యాక్టివ్ కేసులుండగా కోటి నాలుగు ల‌క్ష‌ల మంది కరోనా నుండి కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు 1,53,724 మంది మృతిచెందారు. ఇప్పటివరకు క‌రోనా టీకా తీసుకున్న వారి సంఖ్య 20,29,480కి చేరింది.

- Advertisement -