భారత్‌లో కరోనా @ 834…19 మంది మృతి

290
india corona cases
- Advertisement -

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా …భారత్‌లో కూడా విలయతాండవం చేస్తోంది. ఇప్పటివరకు 834 మంది ఈ మహమ్మారి భారీన పడగా 19 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 110 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రాణాంతక కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు కొనసాగుతూనే ఉంది.

మొత్తం బాధితుల్లో 67 మంది కోలుకోగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ మహమ్మారి విస్తరించింది. కేరళ,మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండగా తెలంగాణలో 59 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 14 కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 24 వేలకు పైగా మంది కరోనా బారిన పడి మరణించగా… 5 లక్షలకు మందికి పైగా ఈ మహమ్మారి సోకిన విషయం తెలిసిందే.

- Advertisement -