- Advertisement -
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 17 వేలు దాటాయి. గత 24 గంటల్లో 1,612 కేసులు నమోదు కాగా కరోనా కేసుల సంఖ్య 17,325కు చేరుకుంది.
నిన్న ఒక్కరోజే అత్యధికంగా మహారాష్ట్రలో 552, గుజరాత్‌లో 367, ఉత్తరప్రదేశ్‌లో 179 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఒక్క రోజులో ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం ఇదే తొలిసారి. ఆదివారం ఒక్క రోజే మరో 39 మంది కరోనాకు బలయ్యారు.
మహారాష్ట్రలో 4,200, ఢిల్లీ 2,003, గుజరాత్ 1,763, రాజస్థాన్ 1,478, తమిళనాడు 1,477, మధ్యప్రదేశ్ 1,407 ఉత్తరప్రదేవ్ 1,100 అలాగే మహారాష్ట్రలో అత్యధికంగా 223 మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్ 72, గుజరాత్ 63, ఢిల్లీ 45, తెలంగాణ 21, యూపీ, ఏపీ 17 ఉన్నాయి.
- Advertisement -