జింబాబ్వేతో జరిగిన సిరీస్ మనదే

46
india
- Advertisement -

జింబాబ్వే టూర్‌లో భాగంగా భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడో వన్డేలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు ఇన్నొంసెంట్‌ కాయా(6) కైటానో(13) వెనువెంటనే వెనక్కి తిరిగారు. అయితే షాన్‌ విలియమ్స్‌(45) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. సికందర్‌ రజా(115) ఆ జట్టును గెలిపించినంత పని చేశారు. అతనికి బ్రాడ్‌ ఇవాన్స్‌(28) మంచి సహకారం అందించారు. కానీ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన క్యాచ్‌తో జింబాబ్వే ఆశలు ఆవిరయ్యాయి. ఈ క్రమంలో జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌట్‌ ఆయింది. దీంతో భారత జట్టు 13 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకొంది. ఆవేష్‌ ఖాన్‌మూడు వికెట్లు తీయగా… చాహర్‌, కుల్దీప్‌, అక్షర్‌ తలో రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. శార్దూల్‌ ఠాకూర్‌ ఒక వికెట్‌ కూల్చారు. అంతకుముందు బ్యాటింగ్‌ దిగిన భారత్‌ ఆటగాళ్లు శుభ్‌మన్‌గిల్‌(130), ఇషాన్‌ కిషాన్‌ (50), శిఖర్‌ ధావన్ (40), పరుగులు సాధించి జింబాబ్వే ముందు ఉంచారు.

- Advertisement -