భారత్-చైనా…కీలక భేటీ!

386
modi
- Advertisement -

భారత్ – చైనా సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న సంగతి తెలిసిందే. భారత్ భూబాగంలోకి చైనా మిలటరీ చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించగా వాటిని భారత ఆర్మీ తిప్పికొట్టింది. ఇక భారత్ – చైనా సరిహద్దుల్లో ఇరుదేశాలకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా కావడంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది.

ఈ నేపథ్యంలో ఇవాళ ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్ధాయి అధికారులు సమావేశం కానున్నారు. లద్దాఖ్ వేదికగా జరిగే ఈ సమావేశంలో హరీందర్ సింగ్ నేతృత్వంలో భారత బృందం చర్చల్లో పాల్గొననుంది.

ఇక చర్చలకు ముందు కీలకపరిణామం చోటుచేసుకుంది. గాల్వన్ లోయ దగ్గర చైనా ఆర్మీ రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లగా.. ఇండియన్ ఆర్మీ కిలోమీటర్ వెనక్కి వెళ్లినట్టు సమాచారం. భారత్‌తో ఉన్న సమస్యల్ని సరైన పద్ధతిలో పరిష్కరించుకోగలమనే విశ్వాసం ఉందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది.

వాస్తవానికి చైనాతో భారత్‌కి సరిహద్దు సమస్య స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచే ఉంది. ఏళ్లుగా ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యపై వివాదం కొనసాగుతూనే ఉంది.అయితే ఇటీవల లద్దాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు, గాల్వన్ లోయ, డెమ్చోక్ ప్రాంతాల్లో ఇరు సైన్యాల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చైనా సైన్యాలు శృతిమించడంతో.. భారత్ ఆర్మీ కూడా దీటుగానే బదులిచ్చింది.

- Advertisement -