తవాంగ్ వీడియో లీక్‌…నిజమెంత?

63
- Advertisement -

డిసెంబర్‌ 9న జరిగిన తవాంగ్ సెక్టార్‌లో జరిగిన భారత్ చైనా ఆర్మీ మధ్య ఘర్షణలకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో చైనా నుండి పీఎల్ఏ సైనికులు సరిహద్దు దాటడానికి ప్రయత్నించే విజువల్స్ ఇందులో ఉన్నాయి. చేతుల్లో లాఠీల‌తో ఉన్న భార‌తీయ జ‌వాన్లు.. చైనా ద‌ళాల్ని స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకున్నారు. తవాంగ్‌ గురించి పార్లమెంట్‌లో కేంద్రం ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ఘర్షణలో ఎటువంటి ప్రాణప్రాయం లేదని ప్రకటించింది. సైనికులకు స్వల్పగాయాల పాలైన సంగతిని పార్లమెంట్‌లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు.

ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న వీడియో.. డిసెంబ‌ర్ 9వ తేదీ నాటికి కాద‌ని భార‌తీయ ఆర్మీ స్ప‌ష్టం చేసింది. ల‌డాఖ‌లోని గాల్వాన్‌లో రెండేళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న త‌ర్వాత బ‌హుశా ఈ అటాక్ జ‌రిగి ఉంటుంద‌ని భావిస్తున్నారు. కొత్త‌గా వైర‌ల్ అవుతున్న వీడియోలో.. చైనా ద‌ళాలు భార‌త భూభాగంలోకి చొచ్చుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించాయి. బోర్డ‌ర్ దాటాల‌నుకుంటున్న చైనా ఆర్మీని .. లాఠీల‌తో భార‌తీయ సైనికులు ధైర్యంగా అడ్డుకున్నారు. కానీ ఈ వీడియోకు చెందిన పూర్తి వివ‌రాలు ఇంకా రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి…

జిమ్ చేస్తే.. గుండె పోటు వస్తుందా ?

చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా.. జాగ్రత్త !

నేటి బంగారం,వెండి ధరలివే

- Advertisement -