టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి రెస్ట్ ఇచ్చింది బీసీసీఐ. న్యూజిలాండ్‌తో జరగనున్న చివరి రెండు వన్డేలతో పాటు మూడు టీ20 మ్యాచ్‌లకు అతను దూరంకానున్నాడు.అదేవిధంగా టీ20 సిరీస్‌కు కోహ్లి అందుబాటులో ఉండడని బీసీసీఐ పేర్కోంది. కోహ్లీ రెస్టు తీసుకోవడంతో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండు వన్డేలతో పాటు టీ20లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
గత కొన్ని నెలలుగా కోహ్లిపై పని ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం అతడికి విశ్రాంతి అవసరం. అదే విధంగా భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు కోహ్లి సన్నద్ధం కావాలి. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీనియర్ సెలక‌్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ మీడియాకు వెల్లడించింది.నేపియర్‌లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.
The @BCCI have announced that captain @imvKohli will be rested for the last two ODIs of the current #NZvIND series and all three T20Is.
➡️ https://t.co/3CmPTXf9Dr pic.twitter.com/HVOEgCHloL
— ICC (@ICC) January 23, 2019