ఇండియా కూటమి..కీలక సమావేశం!

4
- Advertisement -

ఈ నెల 19న ‘ఇండియా బ్లాక్’ కీలక సమావేశం జరగనుంది. ఈ ఏడాది చివ‌ర‌లో బీహర్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న సంగతితెలిసిందే. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో రాజ‌కీయ‌ పార్టీలు ముంద‌స్తు ఎన్నిక‌ల‌ ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తున్నాయి.

ఎన్డీయే – ఇండియా కూటమిలకు ఈ ఎన్నికలు సవాల్‌గా మారగా ఓట్ల చోరీ, ఓట‌ర్ అధికార్ యాత్ర పేరుతో ఇండియా కూటమి నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలో నెలకొన్న సీట్ల పంపకాల ఓ కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్‌ ఈ నెల 19న కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మిత్రపక్షంగా ఉన్న ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఈ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీలో ఉంటామన్న ప్రకటన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. పోటీ చేయాలనుకుంటున్న స్థానాలతో పాటు, పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు ఇచ్చే స్థానాలపై ఈ భేటీలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Also Read:KTR:సెప్టెంబర్ 17..జాతీయ సమైక్యత దినోత్సవం

- Advertisement -