సొంతగడ్డపై టీమిండియా మరోసారి అద్వితీయ ప్రదర్శన చేసింది. దక్షిణాఫ్రికా జట్టుతో పుణేలో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై భారత్ కిది వరుసగా 11వ సిరీస్ విజయం. ఇది వరల్డ్ రికార్డు. మరే జట్టు కూడా సొంతగడ్డపై ఇన్నేసి సిరీస్ లు వరుసగా గెలవలేదు. భారత్ తర్వాతి స్థానంలో ఆసీస్ (వరుసగా 10 సిరీస్ విజయాలు) ఉంది.
ఇక భారత్-దక్షిణాఫ్రికాల మధ్య మూడో టెస్టు ఈనెల 19 నుంచి రాంచీలో జరగనుంది. ఈ రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీల ఇన్నింగ్స్ టీ బ్రేక్ తర్వాత ముగిసింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో డీన్ ఎల్గర్(48), బావుమా(38), ఫిలిండర్(37), మహరాజ్(22)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా వారంతా దారుణంగా విఫలయ్యారు. దాంతో కోహ్లి అండ్ గ్యాంగ్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది.
తొలి ఇన్నింగ్స్:
భారత్- 601/5 డిక్లేర్డ్
దక్షిణాఫ్రికా- 275 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్:
సౌతాఫ్రికా- 189 ఆలౌట్(67.2)