భారత్‌తో జరిగిన తొలి టీ20లో విండీస్ ఓటమి పాలైంది. భారత్ విధించిన 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 122 పరుగులు మాత్రమే చేసింది. కైల్ మేయర్స్ 15,బ్రూక్స్ 20, పూరన్ 18,పావెల్ 14,హెట్‌మెయిర్ 14,హోసెన్ 11 పరుగులు చేశారు. దీంతో విండీస్‌పై 68 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 64 పరుగులు చేశాడు. చివర్లో దినేశ్ కార్తీక్ 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్స్ లతో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు (3,443) చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలవడమే కాకుండా 27వ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్న న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ మార్టిన్ గప్తిల్ (3,399)ను రోహిత్ వెనక్కినెట్టాడు.