తిలక్,శాంసన్ సెంచరీల మోత!

7
- Advertisement -

దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఆటగాళ్లు దుమ్ములేపారు. వాండర్సర్‌లో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. భారత్‌ నిర్దేశించిన 284 పరగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 148/10 స్కోరుకు పరిమితమైంది. స్టబ్స్‌(43) పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా ఘోరంగా విఫలమయ్యారు. అర్ష్‌దీప్‌సింగ్‌(3/20 ), అక్షర్‌పటేల్‌(2/6), చక్రవర్తి(2/42) వికెట్లు తీశారు.

అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఒక వికెట్ కొల్పోయి 283 పరుగులు చేసింది. తిలక్ వర్మ బ్యాక్ టూ బ్యాక్ సెంచరీలతో రాణించాడు. 47 బంతుల్లో 120 నాటౌట్‌, 9ఫోర్లు, 10 సిక్స్‌లతో రాణించగా శాంసన్‌ 56 బంతుల్లో 109 నాటౌట్‌, 6ఫోర్లు, 9సిక్స్‌లు) సెంచరీలతో అలరించాడు. తిలక్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ , మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ దక్కాయి.

ఈ టీ 20 ద్వారా సంజు శాంసన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా శాంసన్‌ నిలిచాడు. టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. టీ20ల్లో ఏ వికెట్‌కైనా భారత్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం(210*). విదేశాల్లో టీ20ల్లో టీమ్‌ఇండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు(283/1).

Also Read:దేశభక్తిని పెంపొందించే.. ‘అభినవ్’

- Advertisement -