Aisa Cup:భారత్ చేతిలో పాక్ చిత్తు

6
- Advertisement -

ఆసియా కప్ 2025లో భాగంగా హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాక్ విధించిన 128 పరుగుల టార్గెట్‌ను 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 నాటౌట్‌గా నిలవగా తిలక్ వర్మ (31) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

ఇక అంతకముందు టాస్‌ గెలిచి తొలుత పాక్‌ బ్యాటింగ్​కు దిగింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (40) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు,షాహీన్‌ అఫ్రిది (33*; 16 బంతుల్లో 4 సిక్స్‌లు) చివర్లో రాణించడంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది.

3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్న కుల్‌దీప్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. గేమ్‌ ఛేంజర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అక్షర్‌ పటేల్‌కు వచ్చింది. భారత్ తన తదుపరి మ్యాచ్​ సెప్టెంబర్ 19న ఒమన్​తో తలపడనుంది.

Also Read:‘మిరాయ్‌’కి అద్భుత స్పందన

- Advertisement -