BB9:శ్రష్టి వర్మ ఎలిమినేట్

14
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 9 తెలుగు విజయవంతంగా ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది. ఇక తొలివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. శ్రష్టి వర్మ నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరినీ సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున.. చివరిగా మిగిలిన శ్రష్టి వర్మ, డీమన్ పవన్ ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోని చూపించారు నాగ్. వెళ్లే ముందు హౌస్‌లో నలుగురు జెన్యూన్.. నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ల లిస్ట్ ఇచ్చేసి వెళ్లిపో అంటూ నాగ్ అన్నారు. జెన్యూన్ లిస్ట్‌లో రాము రాథోడ్ పేరు చెప్పింది శ్రష్టి. అతను చాలా ఇన్నోసెంట్.. నా టామ్ అని చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరిత హరీష్ పేర్లు చెప్పింది. మనీష్ చాలా జెంటిల్‌మ్యాన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది అని చెప్పుకొచ్చింది.

ఇక కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతూ చౌదరి పేరు చెప్పింది శ్రష్టి. తర్వాత తనూజ ,సంజన ,భరణి పేరు చెబుతూ ఎమోషనల్ అయింది శ్రష్టి. ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా.. ట్రస్ట్. ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్లీ రాదు లైఫ్ లాంగ్ రాదు.. ఐయామ్ సారీ భరణి అన్నా కానీ అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్నా అంటూ భావోద్వేగాని గురైంది. చివరిగా వెళ్లేటప్పుడు సుమన్ శెట్టి పై బాంబు వేసి వెళ్లింది.

Also Read:‘మిరాయ్‌’కి అద్భుత స్పందన

- Advertisement -