- Advertisement -
ఆసియా కప్‌లో మరోసారి పాకిస్తాన్ జట్టును ఓడించింది టీమిండియా. సూపర్ ఫోర్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది భారత్. పాక్ విధించిన 172 పరుగుల టార్గెట్‌ను 18.5 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి చేధించింది.
భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో 39 బంతుల్లోనే 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. గిల్ కూడా 28 బంతుల్లో 47 రన్స్ చేసి ఔటయ్యాడు. తిలక్ వర్మ 19 బంతుల్లోనే 30 పరుగులు చేయగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు.
అంతకముందు టాస్ గెలిచిన భారత్…పాక్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఫర్హాన్ 58 పరుగులు చేయగా అయూబ్ 21,నవాజ్ 21,ఆష్రఫ్ 20 పరుగులు చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మకు దక్కింది.
Also Read:Bathukamma:ఎంగిలిపూల బతుకమ్మ
- Advertisement -

