గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ సేన సత్తాచాటింది. ఆల్‌రౌండ్ షోతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. భారత్ విధించిన 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది.
186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టుకు మొదట్లోనే దెబ్బ తగిలింది. జోస్ బట్లర్(9) వెంటనే ఔటైనా మరో ఓపెనర్ జేసన్ రాయ్(40: 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే రాయ్‌కు ఇతర ఆటగాళ్ల నుండి సహకారం లభించలేదు. కెప్టెన్ మోర్గాన్(4), శామ్ కర్రాన్(3) ,మలాన్(14), జానీ బెయిర్ స్టో(25) విఫలమయ్యారు. బెన్ స్టోక్స్(46) చివరగా ధాటిగా ఆడిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఇంగ్లాండ్ ఓటమి తప్పలేదు.
అంతకముందు తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(57) అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. రిషబ్ పంత్(30) ,శ్రేయాస్ అయ్యర్(37) రాణించారు.సూర్యకుమార్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా ఈ విజయంతో టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేసింది. శనివారం నిర్ణాయక ఐదో టీ20 జరగనుంది.