ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 237 పరుగుల టార్గెట్‌ను 38.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కొల్పోయి టార్గెట్‌ను చేధించింది.
రోహిత్ శర్మ(121 నాటౌట్ 13 ఫోర్లు, 3 సిక్సర్లు)తో రాణించగా విరాట్ కోహ్లీ (74 నాటౌట్ 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. శుభ్‌మన్ గిల్ (24) పర్వాలేనిపించాడు. రోహిత్ శర్మ 63 బంతుల్లో, విరాట్ కోహ్లీ 56 బంతుల్లో అర్ధశతకాలను అందుకున్నారు. హాఫ్ సెంచరీ తరువాత మరింత దూకుడును పెంచిన రోహిత్ శర్మ 105 బంతుల్లో సెంచరీ చేశాడు.
వన్డేల్లో రోహిత్‌కు ఇది 33వ శతకం కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో 50వ సెంచరీ కావడం గమనార్హం. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మాట్ రెన్షా (56) , మిచెల్ మార్ష్ (41), మాథ్యూ షార్ట్ (30) రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లు ఒక్కొ వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఓడినా సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
Also Read:వివాహేతర సంబంధాల్లో బెంగళూరు టాప్

