ప్రపంచకప్ 2023లో భాగంగా బోణి కొట్టింది టీమిండియా. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 200 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్..కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మరో వికెట్ పడకుండా 165 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్నారు కోహ్లీ, కేఎల్ రాహుల్. కోహ్లీ 85 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ (97 నాటౌట్)తో రాణించడంతో భారత్ 41.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.
ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. కీలక బ్యాట్స్ మెన్ ఒక్కొక్కరు పెవిలియన్ బాట పడుతుండటంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించలేకపోయింది. ఓ దశలో స్టీవ్ స్మిత్, లబుషేన్ రాణించడంతో 110/2తో ఉన్న ఆసీస్ 49.3 ఓవర్లలో ఆలౌట్ అయింది. భారత్ తన తర్వాతి మ్యాచ్ అక్టోబర్ 11న అఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది.
Also Read:ఎలక్షన్ రిపోర్ట్:బెల్లంపల్లిలో బిఆర్‌ఎస్ కు తిరుగులేదా!