రెండో టీ20లో భారత్ గెలుపు..

200
ind vs aus
- Advertisement -

ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ గెలుపొందింది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా ఉండటంతో పలుమార్లు పరిశీలించిన అంపైర్లు రెండున్నర గంటల ఆసల్యంగా మ్యాచ్‌ ప్రారంభించారు. 8 ఓవర్లకు మ్యాచ్ కుదించగా ఆసీస్‌ 91 పరుగుల టార్గెట్ విధించింది. లక్ష్యఛేదనలో భారత్‌ 7.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (20 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా కేఎల్‌ రాహుల్‌ (10; ఒక సిక్సర్‌), విరాట్‌ కోహ్లీ (11; 2 ఫోర్లు), దినేశ్‌ కార్తీక్‌ (2 బంతుల్లో 10 నాటౌట్‌; ఒక ఫోర్‌, ఒక సిక్సర్‌) పరుగులు చేశారు.

ఇక అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ నిర్ణీత 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ (15 బంతుల్లో 31; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆరంభంలో ధాటిగా ఆడగా.. మాథ్యూ వేడ్‌ (20 బంతుల్లో 43 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రోహిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

- Advertisement -