తొలి టీ20లో టీమిండియా గెలుపు..

57
- Advertisement -

ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించింది. ఆసీస్ విధించిన 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 209 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ముఖ్యంగా సూర్య…తొలిసారి కెప్టెన్‌గా అదుర్స్ అనిపించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ 42 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లతో 80 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 58 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. చివరల్లో రింకూ సింగ్ ధాటిగా ఆడటంతో భారత్ గెలుపు ఖాయమైంది.

అంతకముందు టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. జోస్‌ ఇంగ్లిస్‌ సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 50 బంతుల్లో 8 సిక్స్‌లు,11 ఫోర్లతో 110 పరుగులు చేసి ఆసీస్ భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు సూర్యకుమార్‌యాదవ్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఆదివారం తిరువనంతపురంలో రెండో టీ20 జరగనుంది.

Also Read:లక్ష్మీ పార్వతి ఓకే.. మరి బాలకృష్ణ ఏమిటి?

- Advertisement -