295 సీట్లలో కూటమిదే గెలుపు:ఖర్గే

8
- Advertisement -

దేశంలో 295 సీట్లలో ఇండియా కూటమి గెలుపొందబోతుందన్నారు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీలో ఇండియా కూటమి నేతల సమావేశం అనంతరం మాట్లాడిన ఖర్గే…బీజేపీ 220 సీట్లకు పరిమితం కాబోతుందన్నారు. ప్రజలు ఇండియా కూటమికి మద్దతిచ్చారని…కూటమి నేతలంతా ఐక్యంగా ఉన్నామని తెలిపారు. కూటమిని విడదీసే ప్రయత్నం చేయవద్దన్నారు.

కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌తో పాటు సీఎం కేజ్రీవాల్, వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు.

Also Read:కాంగ్రెస్,బీజేపీ మధ్యే పోటీ:కోమటిరెడ్డి

- Advertisement -